|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 03:44 PM
హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు కంది సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ నాయి, జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్, చిట్యాల మండల అధ్యక్షుడు అంశాల అనిల్ కుమార్, వెలిమినేడు గ్రామ అధ్యక్షుడు కానుగుల నవీన్, చిట్యాల పాండు తదితరులు పాల్గొన్నారు.