|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 12:36 PM
TG: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలోని మేఘాలు హనుమంతుడి రూపంలో దర్శనమిచ్చాయి. ఈ అరుదైన దృశ్యం నిర్మల్ జిల్లా సొన్ మండలం పాక్‌పట్ల గ్రామ సమీపంలో కనిపించింది. మేఘాలు ఇలా దేవుడి రూపంలో దర్శనమివ్వడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలువురు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం వైరల్ అవుతోంది.