|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 06:25 PM
TG: కేసీఆర్‌కు ఉన్న ముందుచూపు, దక్షత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ అధికారులతో కేసీఆర్ వరుస సమీక్షలు నిర్వహించేవారని, కేంద్రానికి ప్రతి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు సమర్పించేవారని గుర్తు చేశారు. అంతేకాకుండా, ఏపీలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసేవారని తెలిపారు.