|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 01:59 PM
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా, కమిటీ నివేదికపై ప్రభుత్వ వైఖరిని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు తెలియజేశారు. అసెంబ్లీలో చర్చించిన తరువాతే నివేదికపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్య న్యాయమూర్తుల ధర్మాసనానికి వెల్లడించారు.
కమిటీ నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన అంశాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విధానాన్ని కోర్టు ససేమిరా అంది.
దీంతో పాటు, నివేదికను వెంటనే వెబ్‌సైట్ నుంచి తొలగించాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని కోర్టు వాయిదా వేసింది.