|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 07:36 PM
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే భర్తను హత్య చేసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అల్లాపూర్ ప్రాంతంలో భర్త మహ్మద్ షాదుల్‌ను భార్య తబస్సుమ్ ప్లాన్ చేసి మర్డర్ చేసింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి నిద్రిస్తున్న భర్తను దిండుతో అదిమిపట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.