|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 08:01 PM
పీడిత ప్రజల పక్షాన నిలిచి దళిత, బహుజన వర్గాలకు అండగా నిలబడి బహుజన ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం సర్దార్ పాపన్న జయంతి పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ ఎం ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుడిగా జన్మించి రాజుల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్న అని కొనియాడారు.జమీందార్లు, పెత్తందార్లు, జాగీర్‌దార్లు, భూస్వాములు, ధనిక వర్గాలకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకుని భవిష్యత్తులో మన హక్కుల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.