|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 01:01 PM
మణుగూరు నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కమలాపురం, ఏటూరు నాగారం గ్రామాల ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మణుగూరు నుంచి వరంగల్ వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించరాదని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.