![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:54 PM
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్న పద్ధతిలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో గ్రామ దేవతలు పోషవ్వ, పెద్దమ్మ తల్లులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున డబ్బు సప్పులతో పోయి బోనం సమర్పించి, అక్కడే వనభోజనాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామస్తులు అందరూ చల్లగా ఉండాలని గ్రామ దేవతలను గ్రామస్తులు వేడుకున్నారు.