![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:31 PM
హైదరాబాద్‌లోని ABIDS ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఎప్పటిలాగే వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం NTR స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు జరగనున్న రథయాత్రకు వేలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ధర్నాచౌక్, RTC క్రాస్ రోడ్స్, నారాయణగూడ, లిబర్టీ, BJR సర్కిల్, చెర్మాస్, BATA T జంక్షన్, MJ మార్కెట్, మాలకుంట ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.