|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:04 PM
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను కొత్త రికార్డు స్థాయులకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా అమెరికా-వెనిజువెలా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సేఫ్ హేవన్ డిమాండ్‌ను పెంచడంతో మంగళవారం బంగారం, వెండి ధరలు ఒక్కరోజులోనే 1 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1.2 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,38,381 వద్ద ఆల్‌టైమ్ హైను తాకాయి. ఇవాళ ఉదయం 10.48 గంటల సమయానికి ఇవి 1.01 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మరింత వేగంగా దూసుకెళ్లాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ 1.7 శాతం పెరిగి కిలోకు రూ.2,16,596 వద్ద కొత్త రికార్డు నెలకొల్పింది. ఇదే సమయానికి వెండి ధరలు 1.30 శాతం లాభంతో కొనసాగాయి.