|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:40 PM
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు-నిజాలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా ఇదివరకు చెప్పిన మాటలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా కోసం రైతులు పడ్డ కష్టాలు పత్రికా సాక్ష్యాలుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని ఆయన అన్నారు. అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని, ఇప్పుడు అవే మాటలను కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా సరైన పాలన అందించలేదని ఆయన అన్నారు. అందుకే ప్రజలు ప్రజా పాలనకు ఓటేశారని ఎంపీ అన్నారు.