|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:07 PM
తెల్లవారుజామున కురుస్తున్న దట్టమైన పొగ మంచు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతబాద్ శివారులో సోమవారం రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. అల్లాదుర్గం- మెటల్ కుంట రోడ్డులో రాయికోడు వైపు వెళ్తున్న చెరుకు లారీ, వరిపొట్టు లోడుతో గంగ్వార్ వస్తున్న లారీలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మీర్జాపూర్(బి) ఆసుపత్రికి తరలించారు.