|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 03:49 PM
TG: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను తెప్పిస్తోంది. అయితే ఈ బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తున్నట్లు సమాచారం. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.