|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:33 AM
పటాన్చెరు : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సయ్యద్రాజా మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మనోజ్ కుమార్ తండ్రి ఠాకూర్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఆల్విన్ కాలనీలో గల మనోజ్ కుమార్ గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోజ్ కుమార్ ను ఓదార్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఠాకూర్ సింగుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కంకర సీనయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.