|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:43 AM
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని, MDR ఫౌండేషన్ కో–ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన MDR’S యునైటెడ్ క్రిస్మస్ కారోల్స్ ఈవెనింగ్ – 2025 కార్యక్రమం అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు సామాజిక ఐక్యత సందేశాలతో విజయవంతంగా ముగిసింది.పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని 24 చర్చిలకు చెందిన పాస్టర్లు మరియు వారి బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు. వివిధ చర్చిల నుంచి వచ్చిన బృందాలు అందించిన హృదయాన్ని తాకే క్రిస్మస్ కారోల్స్, సందేశాత్మక ప్రసంగాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు వేడుకకు అదనపు వైభవాన్ని చేకూర్చాయి.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగం మరియు సోదరభావానికి ప్రతీక అని, మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేసే శక్తి ఇలాంటి కార్యక్రమాలకే ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరికీ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు.
అనంతరం పాస్టర్లు మాద్రి పృథ్వీరాజ్ గారిని ఘనంగా సన్మానించి, సామాజిక సమైక్యత కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఐక్యతా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్టింగ్, MDR క్రిస్మస్ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించబడింది.కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లకు శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేయడం జరిగింది. ప్రజలు, చర్చ్ ప్రతినిధులు మాద్రి పృథ్వీరాజ్ గారిని హర్షాతిరేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా MDR’S యునైటెడ్ క్రిస్మస్ కారోల్స్ ఈవెనింగ్ – 2025, మతాలకు అతీతంగా ప్రేమ, శాంతి, ఐక్యత సందేశాన్ని ప్రజల్లో బలంగా ప్రతిధ్వనింపజేసిన విశిష్ట కార్యక్రమంగా నిలిచింది.