ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:21 PM
దుబ్బాక పట్టణంలోని బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఆలయ మూలవిరాట్ విశ్వక్ సేన (గణపతి) విగ్రహానికి 1 కేజీ 500 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు, ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతరాజు సమక్షంలో ఈ పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేసి, విశ్వక్ సేన విగ్రహానికి వెండి కిరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, పరశురామ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.