|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:50 PM
ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అంటూ వస్తున్న వార్తలను పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఉప సర్పంచుల అధికారాల విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాబట్టి అలాంటి నిర్ణయానికి తావులేదని సీతక్క స్పష్టం చేశారు.