|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:46 PM
హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ - 1 లో సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మిమీ డయా ఎంఎస్ పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీని అరికట్టడం, నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వులను మార్పిడి చేయడం, నాసర్లపల్లి వద్ద 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మిమీ డయా ఎంఎస్ జంక్షన్ పనులు చేపట్టడం,కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న 600 మిమీ డయా పై దెబ్బతిన్న బిఎఫ్ valveలు, ఎన్ఆర్v లను మార్పిడి చేయడం తదితర మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పనులు తేదీ: 27.12.2025, శనివారం ఉదయం 6 గంటల నుంచి తేదీ: 28.12.2025, ఆదివారం వారం సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. కావున ఈ 36 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. O&M డివిజన్ నెం. I: మీరాలం, కిషన్‌బాగ్, బాల్షెట్టీ కేట్, మొగల్ పురా, ఫలక్‌నామా, బహదూర్‌పురా, జహనుమా.
2. O&M డివిజన్ నెం. II: మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా.
3. O&M డివిజన్ నెం. IV: బొగ్గులకుంట.
3. O&M డివిజన్ నెం. V: నారాయణగూడ, ఆడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ రిజర్వాయర్.
5. O&M డివిజన్ నెం. VIII: అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్.
6. O&M డివిజన్ నెం. X: దిల్ సుఖ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు.
7. O&M డివిజన్ నెం. XVIII: హార్డ్ వేర్ పార్క్, జల్ పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ.
8.O&M డివిజన్ నెం. XX: మన్నెగూడా.
కావున అంతరాయం ఏర్పడ నున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.