|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 10:35 AM
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం టీఎన్ జీఓ కాలనీ పరిధిలో చేపట్టే కొత్త రిజర్వాయరు, ఎస్టీపీలతో పాటు అభివృద్ధి పనులను పర్యటించి అధికారులతో సమీక్షించారు. మొదటగా టీఎన్ జీ ఓ కాలనీలోగల అందుబాటులో ఉన్న భూమిలో కొత్త రిజర్వాయరు నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. అలాగే నియో పోలీస్ వద్ద ప్రస్తుతం ఉన్న పైపులను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఓఅర్ ఆర్ వరకు విస్తరించిన ప్రస్తుత పైపు లైను ల అనుసంధానంపై సాధ్యసాధ్యాలను చర్చించారు.టీఎన్ జీఓ కాలనీ పరిధిలో రానున్న రెండు సంవత్సరాలలో.. కాలనీలో నిర్మించే రిజర్వాయర్ల ద్వారా పంపింగ్ అవసరం లేకుండానే ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా చేయవచ్చని అంచనాకు వచ్చారు.అలాగే, రానున్న వేసవిలో గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా ట్యాంకర్ డెలివరీ ఆలస్యం అవడం.. సమస్యని అధిగమించడానికి కొత్త అదనపు ఫిల్లింగ్ స్టేషన్ లను ఏర్పాటుచేసి.. 24 గంటలు ట్యాంకర్ సరఫరా చేసుకోవాలని అధికారులు సూచించారు.అనంతరం రంగారెడ్డి కాలనీ, సెక్రటేరియట్ కాలనీ, టీఎన్ జీఓ కాలనీ, సమీప ప్రాంతాల నుంచి ఉత్పన్నం అయ్యే మురుగును శుద్ధి చేయడానికి నూతన ఎస్టీపీ నిర్మాణం అవసరం అని భావించారు. అందులో భాగంగా రంగారెడ్డి కాలనీ, ట్రీ పార్క్ ప్రాంతంలో ఎస్టీపీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శుద్ధిచేసి, రక్షణ చర్యగా.. జలమండలి సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జీఎం కృష్ణ, డీ జీ ఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.