ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 06:44 PM
మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో రైతు జాల వెంకన్న ఇంటి ఆవరణంలో నిల్వ చేసిన పత్తి అనుమానాస్పదంగా అగ్నికి దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకపోవడంతో కావాలనే నిప్పుపెట్టారని రైతు అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస్ నేత సంఘటనా స్థలానికి చేరుకుని, తగలబడిన పత్తిని పరిశీలించి, రైతు వెంకన్నను పరామర్శించారు. అనంతరం మునుగోడులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఫర్నిచర్ దుకాణాన్ని పరిశీలించి, యజమాని ప్రవీణ్ చారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.