|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 12:28 PM
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడేలా కనిపించడం లేదు. సోమవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు VKB, SRD, MBNR, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్ 17వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.