|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:47 PM
తనపై వేసిన అనర్హత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలను విడనాడి, ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఫోన్ టాపింగ్ కేసు, ఎన్నికల చెల్లనివనే ఆరోపణలు దురుద్దేశపూర్వకమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని హరీశ్ రావు తెలిపారు. "ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ పగపట్టడం మాని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి" అని ఆయన పేర్కొన్నారు.