|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 01:33 PM
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో బుధవారం రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ, మాచారెడ్డి మరియు పాల్వంచ మండలాల్లోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ చర్య గ్రామంలో భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించినదని ఆయన తెలిపారు.