|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:21 PM
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు జారీ కావడంతో కేటీఆర్‌లో ఆందోళన మొదలైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని తెలిపారు. పార్టీ నాయకత్వం కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని, ఇదే సమయం కోసం హరీశ్ రావు కూడా ఎదురుచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే మూడు ముక్కలు కావడం ఖాయమని, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఆయన చుట్టూ ఉన్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.