|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:24 PM
అరేబియా మహాసముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తూర్పువైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.