|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 12:07 PM
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కి ఫిర్యాదు చేయాలని నిజామాబాద్ జిల్లా ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం బిచ్కుందలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డిఎస్పి శేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు.