|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 12:28 PM
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ విడాకులపై తనదైన శైలిలో స్పందించారు. గతంలో దంపతుల మధ్య ప్రేమ, నమ్మకం, సహనం ఉండేదని, ఇప్పుడు మాత్రం చిన్న సమస్యకే విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్ టీవీ షోలో మాట్లాడిన సల్మాన్.. చిన్న అపార్థాలు పెద్ద నిర్ణయాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సల్మాన్ ఖాన్ 59 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉన్నారు.సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, షోలో ఉన్న అర్చనా పూరన్ సింగ్, కపిల్ శర్మ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పగలబడి నవ్వారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సల్మాన్ చెప్పిన మాటలతో చాలా మంది అభిమానులు ఏకీభవించారు. "ఆయన తన కెరీర్ ప్రారంభం నుంచే చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నారు, కానీ ఎప్పుడూ మేధావిలా నటించలేదు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నిజాలు మాట్లాడుతున్నారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం సల్మాన్ ఖాన్" అని మరొకరు రాశారు. "ఆయన 100 శాతం నిజాలు చెబుతున్నారు" అని ఇంకొకరు పేర్కొన్నారు.
Latest News