|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 01:02 PM
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి ఆప్డేట్స్ ఇవ్వడం లేదు. తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది. మరోసారి సమంత , రాజు నిడుమోరు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు. సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. సమంత ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన సమంత, గత కొన్ని రోజులుగా అరబ్ దేశంలో విహరిస్తోంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత షేర్ చేసిన ఓ ఫొటోలో సన్‌గ్లాసెస్ రిఫ్లెక్షన్‌లో రాజ్ నిడిమోరు కనిపిస్తున్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ''ఎప్పుడూ నిశ్చబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాము. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి'' అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్‌తో రాజ్ నిడుమోరుతో తనకున్న బంధాన్ని బయటపెట్టడంతో పాటు ఆయన భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ వేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Latest News