|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 12:22 PM
ప్రముఖ దర్శకుడు సుకుమార్ గద్దర్ అవార్డ్స్‌పై స్పందించారు. "ఎన్ని అవార్డులు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు మాకు ఎంతో ప్రత్యేకం. గత పదేళ్లుగా ఈ గుర్తింపుకి ఎదురుచూస్తున్నాం. అవార్డులు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు" అని అన్నారు. ‘పుష్ప’ వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినప్పటికీ, ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవం మరింత సంతృప్తినిచ్చిందన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్నారు. అల్లు అర్జున్ తో కలిసి ఈయన చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Latest News