|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:10 PM
మంచు మనోజ్ మే 30న ‘భైరవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని రచ్చ చేశారు. ఈ వేడుకలో మనోజ్ తమిళ హీరో శింబుకి లైవ్‌లో కాల్ చేశారు. వాయిస్ సరిగా వినిపించకపోవడంతో హీరోయిన్ అదితి శంకర్ ఫోన్ ఉపయోగించారు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అయితే, శింబు ఫోన్ నంబర్ బయటపడటాన్ని మనోజ్ గుర్తించి “నీకు కొత్త సిమ్ పంపిస్తా” అన్నారు. దీంతో శింబు ‘అయ్యో’ అని షాక్ అయ్యాడు.అయ్యో అని శింబు కూడా షాక్ అయ్యాడు. ఇక శింబు, మనోజ్ ఫోన్ కాల్‌లో సంభాషించారు. నిన్ను చూస్తుంటే నాకు జెలసీగా ఉంది.. కమల్ హాసన్ సర్‌తో నటించావ్.. అద్భుతంగా కనిపిస్తున్నావ్.. థగ్ లైఫ్‌కి ఆల్ ది బెస్ట్ మచ్చా అని మనోజ్ అన్నాడు. మనోజ్ గురించి మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.. మనోజ్ చిన్న పిల్లాడి లాంటి వాడు.. మన ప్రేమను చూపిస్తే.. తిరిగి ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు.. కోపాన్ని చూపిస్తే.. అది మనకు ప్రాబ్లం అవుతుంది.. అందుకే మనోజ్‌ను ఎక్కువగా ప్రేమించాలి.. మనోజ్ లాంటి ఫ్రెండ్‌ను నాకు దొరకడం నా అదృష్టం అని శింబు చెప్పుకొచ్చాడు.
Latest News