|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 11:05 AM
రెట్రో మూవీ OTTలో విడుదలకు సిద్ధమైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘రెట్రో’. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత కొన్నిరోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు వచ్చినప్పటికీ తాజాగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తేదీని ప్రకటించింది. సూర్య సరసన పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో జయరామ్, నాజర్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో కనిపించారు.పారి అలియాస్ పార్వేల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే పుట్టిన ఊరికి.. తల్లిదండ్రులకు దూరమవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) తనకి ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఓ సందర్భంలో తిలక్‌ను శత్రువుల మట్టుపెట్టేందుకు ప్రయత్నించగా.. ఆ ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి నిజమైన కొడుకుగా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా.. తిలక్ నీడలోనే మరో శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి (పూజా హెగ్డే)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.
Latest News