|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 07:49 AM
ప్రఖ్యాత నటులు రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన 38 సంవత్సరాల తరువాత 'షష్ఠి పూర్తి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రొమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ పల్నాడులోని కోటప్పకొండ ఆలయాన్ని సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీసులని అందుకున్నారు. ఈ సందర్శానికి సంబందించిన చిత్రాలని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూపేష్ చౌదరీ నిర్మించారు. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నారు. మా AAIE ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. పవన్ ప్రభాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న విడుదల కానుంది.
Latest News