![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:21 PM
మహేష్ బాబు దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ''ఆంధ్ర కింగ్ తాలూకా'' అనే టైల్ తో విడుదల చేసారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ గ్లింప్సెకి భారీ స్పంద్దన లభించింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా షెడ్యూల్ లో నటుడు జాయిన్ అయ్యినట్లు మరియు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జర్గుతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో నటుడు సూర్య కుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని పోస్టర్ ని విడుదల చేసారు. భగ్యాశ్రీ బోర్స్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతరలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్-మార్విన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News