![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:03 PM
టాలీవుడ్ నటుడు నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్: ది థర్డ్ కేస్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్-ఈవెన్ మార్కును చేరుకుంది. ఈ A- రేటెడ్ క్రైమ్ డ్రామాలో నాని నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 29, 2025 నుండి బహుళ భాషలలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో నానికి జోడిగా యువ కన్నడ నటి శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కార్తీ మరియు అడివి శేష్ అతిధి పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగా ఉన్నారు. నాని మరియు ప్రశాంతి టిపిర్నేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
Latest News