|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:24 PM
యాక్షన్ హీరో విశాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తో పాటు తమిళ్‌లోనూ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక విశాల్ లతో పాటు పెళ్లి గురించి కూడా చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ ఆతర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత పెళ్లి గురించి చాలా వచ్చాయి. మొన్నామధ్య నటి అభినయాను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కోలీవుడ్ లో వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు అని తేలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తాజాగా చెన్నై లో జరిగిన ఓ ఈవెంట్ లో తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్.తాజాగా విశాల్ వివాహం పై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. కాగా విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక ఎవరో తెలుసా.?తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్‌లో ఎన్నో ల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి లో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
Latest News