|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:53 AM
NTR.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలే. తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', బాల రామాయణంలో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. 'నిన్ను చూడాలని' మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి.. 'స్టూడెంట్ నెం.1' తో విజయం అందుకున్న తారక్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. విశ్వ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ‘వార్ 2’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి డ్రాగన్‌తో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన 42వ పుట్టిన రోజు.
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
తారక్ 1983 మే 20న జన్మించారు. HYDలోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.
పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్.
నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి.