|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 12:01 PM
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కారు నడుపుతూ వస్తున్న ఓ యువకుడికి కానిస్టేబుల్ షాక్ ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదంటూ వారించడంతో కారును వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయాడు.అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి టాలీవుడ్ యంగ్ హీరో. ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రూల్స్ విషయంలో పబ్లిక్ అయినా, సెలబ్రిటీలు అయినా అందరూ సమానమే అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇంతకీ రాంగ్ రూట్లో కారు నడుపుతూ అడ్డంగా బుక్ అయిన హీరో ఎవరా అనుకుంటున్నారా.. మన బెల్లం బాబే. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో "బెల్లంకొండ సాయి శ్రీనివాస్" కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Latest News