|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 11:58 AM
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి కథ కూడా గౌతమ్ రాసుకున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని హృదయం లోపల అనే టైటిల్ తో విడుదల చేయగా సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది మరియు యూట్యూబ్ ట్రేండింగ్ లో ఉంది. ఈ చిత్రం మే 30న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా జులై 4కి వాయిదా పడినట్లు స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News