|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 10:57 PM
ఎట్టకేలకు ఆ క్షణం వచ్చేసింది! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన 'ఓజీ' (OG) చిత్రం చివరికి థియేటర్లలో సందడి చేసింది.ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో తమ రివ్యూలతో ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. సినిమాపై మొదటి నుంచే పాజిటివ్ టాక్ హవా నడుస్తోంది.'ఓజీ' చిత్రాన్ని చూసిన వారు పవన్ కళ్యాణ్ నటన, అటిట్యూడ్, స్టైల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ సుజీత్ టేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్, BGM ప్రేక్షకులను అచ్చెత్తుకుంటున్నాయని ట్వీట్లలో పేర్కొంటున్నారు. ఈ అన్ని అంశాలు కలిసొచ్చి సినిమాకు థియేటర్లలో రగిలే అనుభూతిని ఇస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమేర్ సంధూ కూడా ట్విట్టర్‌లో ఈ సినిమాపై స్పందించారు. ఆయన ప్రకారం, "'ఓజీ' పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. చివరి 20 నిమిషాలు సినిమాకే హైలైట్!" అని పేర్కొన్నారు.అయితే, ఉమేర్ సంధూ రివ్యూకు మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో ఆయన హిట్ అని చెప్పిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన నేపథ్యంలో, ఆయన మాటలపై నెటిజన్లలో నమ్మకం తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన రివ్యూలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు సూచిస్తున్నారు.
Latest News