|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 12:52 PM
నల్లగొండ జిల్లాలో బుధవారం మొంథా తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాను కారణంగా జిల్లా విద్యాధికారి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరి పంట పొలాలు నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.