|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 12:49 PM
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' తీరం దాటి ఉత్తర వాయువ్యం దిశగా తెలంగాణపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ సూచన మేరకు, వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బుధవారం విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితులలో 100, 108 కాల్ చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.