|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 12:55 PM
TG: హైదరాబాద్ కేపీహెచ్బీలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. కేపీహెచ్బీ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మందలపు సాయిబాబు చౌదరి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సాయిబాబుతో పాటు గాదెల అనిల్ కుమార్, వాసు రెడ్డి సుధీర్, దొప్పలపూడి రత్నాకర్, చిలుకూరి గోవిందరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.