|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 02:46 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇల్లందు డీఎస్పీ చంద్రబాను పర్యవేక్షణలో సీఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.