|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 12:46 PM
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఔన్సుకు 4 వేల డాలర్లు, దేశీయంగా రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధర, ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి ఔన్స్ ధర 10 వేల డాలర్లు (భారత్‌లో రూ.3 లక్షలు) దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా రష్యా ఆస్తుల్ని స్తంభింపజేసిన తర్వాత.. చాలా దేశాలు డాలరుపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నాయన్న దానిని ప్రధాన కారణంగా చూపారు. ఇంకా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతున్న క్రమంలో.. తమ సంపద విలువ తగ్గకుండా కాపాడుకునేందుకు బంగారాన్ని హెడ్జింగ్‌గా వాడుతున్నారన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బంగారానికి మద్దతు లభిస్తోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.