|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 12:42 PM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించి, ప్రజా రవాణాను మెరుగుపరచడానికి రాబోయే రెండేళ్లలో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా వెల్లడించారు. నగరంలో ఛార్జింగ్ సౌకర్యాల కోసం కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాత గౌలిగూడ బస్టాండ్‌ను పెద్ద ఛార్జింగ్ స్టేషన్‌గా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు