|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 02:42 PM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు 11 రోజులపాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 29న రథోత్సవం, 30న గజవాహన సేవ, అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని అలంకారం, 2న విజయదశమి నాడు శమీపూజ, అపరజితాదేవి ఆలయ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి.