|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:57 PM
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్థాన్ భూభాగాన్ని తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోకుండా అంతర్జాతీయ సమాజం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని భద్రతా పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి స్పష్టం చేసింది.భద్రతా మండలి సమావేశంలో బుధవారం భారత్ తరఫు శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఐఎస్ఐఎల్, అల్-ఖైదా వంటి సంస్థలతో పాటు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి గ్రూపులు, వాటికి సహకరించేవారు ఆఫ్ఘన్ గడ్డను ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. ఇటీవల పహల్గామ్‌లో మతం ఆధారంగా 26 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ తెలిపింది.