|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:30 PM
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) పలు పోస్టుల భర్తీకి తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 160 (టెక్నికల్ ఆఫీసర్ సి) టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్, బీఈ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది.