|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:29 PM
కూకట్‌పల్లి నియోజకవర్గం, అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్.జి. నగర్ సి బ్లాక్‌లో గురువారం కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ 10.20 లక్షల రూపాయల వ్యయంతో 100 ఎంఎం డయా డిఐ వాటర్ సప్లై పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల అభ్యర్థన మేరకే ఈ పైప్‌లైన్ పనులు చేపట్టామని కార్పొరేటర్ పేర్కొన్నారు.