|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:26 PM
గురువారం తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామస్థులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి, గ్రామంలోని నారాయణ బాబా ఆలయ షెడ్డు నిర్మాణ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, షెడ్డు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు వారు తెలిపారు.